నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డెక్కన్ క్రానికల్ దినపత్రికకు 2009లో రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎకరంన్నర భూమిలో చేస్తున్న నిర్మాణాల్లో ఇతరులకు హక్కులు కల్పించరాదని హైకోర్టు ప్రతివాదులను ఆదేశించింది. న్యూస్ పేపర్ కోసం ఇచ్చిన స్థలంలో విల్లాలు, ప్లాట్ల నిర్మాణాల రూపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌ల డివిజన్ బెంచ్ విచారించింది. ప్రభుత్వంతోపాటు డీసీహెచ్‌ఎల్, టీఎన్‌ఆర్ కన్‌సట్రక్షన్స్ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది.