నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలోని దన్నూర్ గ్రామంలోలుటే సంగ్రామ్ అనే వ్యక్తి ఇల్లు భారీ వర్షంతో కూలిపోయింది. గత వారం పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పురాతనమైన ఇల్లు కూలిపోతున్నాయి కూలిన ఇండ్ల లెక్కలు అంచనాలు అధికారులకే తెలియవు ఎందుకంటే అధికారులు ప్రజాప్రతినిధులు భారీ వర్షాలకు జరుగుతున్న నష్టాల గురించి సమాచారం సేకరించడంలో నిద్రవస్తులోనే ఉండటం ఎవరికి ఎలాంటి నష్టం జరిగినా పట్టించుకునే నాధుడే లేడని మండలంలోని కొన్ని గ్రామాల్లో కూలిపోతున్న ఇండ్ల నిర్వాసితులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారం పది రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ప్రతి గ్రామంలో పురాతనమైన ఇల్లు కూలిన వాటి గురించి అధికారుల వద్ద పూర్తి సమాచారం లేకుండా పోతుంది. ప్రభుత్వం ఆదేశిస్తే గాని అధికారులు గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి జోరు వానలతో ఎంతో నష్టం జరుగుతుంది అధికారులు స్పందించాలని ఇల్లు కూలిపోయిన నిర్వాసితులు కోరుతున్నారు.