పిల్లలతో కలిసి తిరిగితే ఎట్లన్న!

How about returning with the children!– జగ్గన్నపై కేటీఆర్‌ సరదా వ్యాఖ్య
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

అసెంబ్లీ లాబీల్లో మంత్రి కేటీఆర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య సరదా చర్చ జరిగింది. టీషర్ట్‌లో ఉన్న జగ్గారెడ్డిని చూసి పిల్లలతో కలిసి తిరిగితే ఎట్లన్న..? అని కేటీఆర్‌ సరదాగా వ్యాఖ్యానించారు. టీషర్ట్‌ వేసుకుంటే పిల్లలవుతారా? అని జగ్గారెడ్డి అడిగారు. అప్పటికే జగ్గారెడ్డితో టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షులు మామిల్ల రాజేందర్‌ కలిసి ఉండగా, మీ ఇద్దరికి ఎక్కడ దోస్తాన్‌ కుదిరింది అని కేటీఆర్‌ అడిగారు. దీంతో మాది ఒకే కంచం, ఒకే మంచమని మామిల్ల రాజేందర్‌ జవాబిచ్చారు. అయితే జగ్గారెడ్డిని గెలిపిస్తావా..? అని కేటీఆర్‌ ప్రశ్నించగా, సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తా.. మన దగ్గరకు పట్టుకొస్తా అని రాజేందర్‌ సరదాగా వ్యాఖ్యానించారు.