అధిగమించడమెలా?

How to overcomeమోనోపాజ్‌… జీవితంలో ప్రతి మహిళా ఎదుర్కొనే ఓ దశ. సహజంగా 50 నుంచి 55 యేండ్లలోపు ఈ దశ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి ప్రతినెలా క్రమం తప్పకుండా వచ్చే రుతుక్రమం నుంచి తప్పించుకునే అవకాశం లభిస్తుంది. అయితే ఈ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు నియమాల గురించి చాలామందికి అవగాహన ఉండదు. అలాంటి వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
మోనోపాజ్‌ దశ రావడానికి ప్రధాన కారణం హార్మోన్లే. రుతుక్రమం ప్రారంభం అయినప్పటి నుంచి విడుదలయ్యే అండాలు హార్మోన్లు విడుదల క్రమంగా తగ్గిపోవడం ఈ దశ లక్షణం. ఈ దశకు ముందు రుతుక్రమం అస్తవ్యస్తమవుతుంది. కొందరికి నాలుగైదు నెలల వరకు రుతుక్రమం రాకపోవచ్చు. మరికొందరికి యేడాది వరకు రాకపోవచ్చు. అది వారి వారి శరీరతత్వం మీద ఆధారపడి ఉంటుంది.
ఈ దశ ప్రారంభం కావడానికి యేడాది రెండేండ్ల ముందు నుంచే లక్షణాలు ఒక్కొక్కటిగా బయట పడుతుం టాయి. అవన్నీ తాత్కాలిక సమస్యలుగానే గుర్తించాలి. వాటిని అధిగమిం చడానికి మందుల కన్నా ఆహారంలోనూ, జీవన విధానంలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలం టున్నారు నిపుణులు. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లకు పీరియడ్స్‌ను నియంత్రించే శక్తి ఉంటుందట. అందుకే అవి ఎక్కువగా ఉండే ఆహారం మోనోపాజ్‌పై ప్రభావం చూపుతుందట. అందుకే టమాటా, నల్లద్రాక్ష, గ్రీన్‌టీ, నిమ్మ, ఆపిల్‌, ఉల్లిగడ్డ, క్యారెట్‌ లాంటివి కచ్చితంగా ఆహారంలో వుండేలా చూసుకోవాలి.