జమ్ము కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

ఐదుగురు ఉగ్రవాదులు మృతి
శ్రీనగర్‌ (జమ్ము కాశ్మీర్‌) : జమ్ము కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల గురించి కచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నాయని కాశ్మీర్‌ జోన్‌ పోలీసు విభాగం తెలిపింది. ఇప్పటివరకు ఐదుగురు ఉగ్రవాదులు మరణించినట్లు ట్వీట్‌ చేసింది.