కేంద్రీయ విద్యాలయ మంజూరు కోసం నిరాహార దీక్ష..

–  ఆందోళనలను విరమింపజేసిన ఎమ్మెల్యే  బాధ్యతగా మంజూరు చేయించాలి,

– గ్రామ సర్పంచ్ కు గ్రామ కార్యదర్శికి యువకుల వినతి
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల కేంద్రానికి కేంద్రీయ విద్యాలయం మంజూరు కోసం గ్రామ ప్రజలు కొన్ని నెలలు తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష ఆందోళనలు చేపట్టగా జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే దీక్ష శిబిరానికి వచ్చి కేంద్రీయ విద్యాలయం ఎక్కడికి వెళ్ళదు మద్నూర్ మండల కేంద్రానికి మంజూరు. అవుతుందని హామీ ఇచ్చి దీక్ష ఆందోళనలు విరమింపజేసిన జుక్కల్ ఎమ్మెల్యే అనుమంతు సిండే తన బాధ్యతగా కేంద్రీయ విద్యాలయాన్ని వెంటనే మంజూరు. చేయించాలని డిమాండ్ చేస్తూ గ్రామ యువకులు శుక్రవారం నాడు గ్రామపంచాయతీ కార్యాలయానికి తరలివెళ్లి గ్రామ సర్పంచ్ సురేష్ కు గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్ కు ఒక వినతి పత్న్ని అందజేశారు. అందుబాటులో గ్రామ కార్యదర్శి గ్రామ సర్పంచ్ లేకపోవడంతో పంచాయితీ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ చంద్రకాంత్ కు ఆ యువకులు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయం మద్నూర్ మండల కేంద్రానికి మంజూరయ్యే విధంగా ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. గ్రామస్తులు కులమతాలకు అతీతంగా కేంద్రీయ విద్యాలయం మంజూరు కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడితే ఎమ్మెల్యే దీక్ష శిబిరానికి వచ్చి ఆందోళనలు వద్దు కేంద్రీయ విద్యాలయం ఎక్కడికి వెళ్ళదు మద్నూర్ కు మంజూరు అవుతుందని హామీ ఇచ్చిన దానిని మంజూరు చేయించాలని గ్రామ యువకులు  సిద్ధప్ప, బాలు యాదవ్ తదితరులు కలిసి వినతి పత్రం అందజేశారు.