గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి ఎరగని హుస్నాబాద్

– నేడు మున్సిపల్ అభివృద్ధికి రూ.465. 29 కోట్లు 

– అభివృద్ధి చేసిన మరోసారి ఆశీర్వదించండి
– అభివృద్ధికి నిదర్శనం జాతీయస్థాయి అవార్డులు
– హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ 
నవతెలంగాణ- హుస్నాబాద్: గత ప్రభుత్వ అభివృద్ధి జరగలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వేల కోట్ల రూపాయలతో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని హుస్నాబాద్ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలో 8,9,18,19 వార్డులలో హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వార్డులలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతూ, మంగళహారతులతో, కోలాటాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ  అభివృద్ధికి నిదర్శనం హుస్నాబాద్ మున్సిపాలిటీ కీ జాతీయస్థాయిలో వచ్చిన అవార్డులే చెబుతాయన్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీకి అత్యధికంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేశామని, తెలిపారు. ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, ఎల్లమ్మ చెరువు మరమ్మత్తులు, ఇండోర్ స్టేడియం, డిగ్రీ కాలేజ్, ఉమెన్స్ హాస్టల్ భవనం, టిటిసి భవనం, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు, దవాఖాన భవన నిర్మాణం, సోషల్ వెల్ఫేర్ గురుకుల భవనం,ఎస్టీ గురుకుల భవనం, షాపింగ్ కాంప్లెక్స్, మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం, పాలిటెక్నిక్ కాలేజ్, డంపింగ్ యార్డ్, డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం, పంచాయతీరాజ్ రోడ్లు, నర్సరీ నిర్మాణం,మార్కెట్, బంజారా భవన్, షాదీఖానా, మాతా శిశు సంరక్షణ కేంద్రం, వ్యవసాయ మార్కెట్, ఏసీబీ కార్యాలయం, గ్రంధాలయ భవనం, టీఎన్జీవో భవనం, భవన నిర్మాణ కార్మిక సంఘం, ఎంపీడీవో కార్యాలయం, జర్నలిస్టు కాలనీ, గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల కాలనీ, అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ హాల్, ప్రెస్ క్లబ్ దగ్గర కమ్యూనిటీ హాల్, వివిధ రోడ్లు, మున్సిపల్ పార్క్, హెల్త్ సబ్ సెంటర్, స్కూల్ మరమ్మత్తులు అలాగే ఆసరా పథకం కింద పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు, రైతుబంధు పథకం ద్వారా నిధులు, రైతు బీమా పథకం ద్వారా లబ్ధిదారులకు పంపిణీ, గొర్రెల పంపిణీ, దళిత బంధు, కంటి వెలుగు ద్వారా పరీక్షలు, ఆరోగ్యశ్రీ పథకం, కేసీఆర్ కిట్ అందిస్తున్నామని తెలిపారు. పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజనీ తిరుపతి రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అన్వర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.