– మతి భ్రమించి మాట్లాడుతున్న తుమ్మల
– ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ
నవతెలంగాణ- ఖమ్మం
”నీకు ఓటు వేసినోడికే ఖమ్మంలో ఓటు ఉండాలా… వేరే వాడికి ఓటు ఉండొద్దా” అని ఖమ్మం బీఆర్‌ఎస్ నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. మంగళ వారం ఖమ్మంలోని 12, 13వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో రాయల శేషగిరిరావు, జక్కంపూడి వీరభద్రం, నలజాల రవి అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”నీకు ఓటు వేస్తే అది మంచి ఓటు.. వెయ్య కుంటే అది దొంగ ఓటా” అంటూ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, కార్పొరేటర్‌లు కొత్తపల్లి నీరజ, చిరమామిళ్ళ లక్ష్మీ నాగేశ్వరరావు, మారగాని సుదర్శన్, రామారావు పాల్గొన్నారు.
ఖమ్మంకార్పొరేషన్ : ఖమ్మం నగరంలోని స్టేషన్ రోడ్‌లో ఆక్స్‌ఫర్డ్‌్ స్కూల్ యాజమాన్యం మతిన్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్‌ఎస్ పార్టీ ఖమ్మం నియోజవర్గ అభ్యర్థి పువ్వాడ అజరుకుమార్ పాల్గొన్నారు.కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల మేనేజ్మెంట్, అధ్యక్షుడు రాం చందర్, గొల్లపూడి రాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం: ఖమ్మంనగరం 51, 52వ డివిజన్‌లో నాయిబ్రాహ్మణ సంఘం అధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు నంజ్యాల నర్సింహారావు, ఎం. హరినాథ్, దోమకొండ నాగేశ్వరరావు, అలాటి వెంకట అప్పయ్య అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఖమ్మం నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజరు కుమార్ పాల్గొని మాట్లాడారు. 44వ డివిజన్ నందు ఖమ్మం జిల్లా ఫ్లవర్స్ మర్చంట్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలోనూ పువ్వాడ అజరు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో కార్పొరేటర్‌లు శీలంశెట్టి రమా వీరభద్రం, బుర్రి వెంకట్ కుమార్, పొన్నం వెంకటేశ్వర్లు, సూత్రాల శ్రీనివాస్, తిరుమల రావు, జక్కుల లక్ష్మయ్య, పిన్ని కోటేశ్వర రావు, పల్లా రాజశేఖరావు, 44వ డివిజన్ కార్పొరేటర్ పాలెపు విజయ వెంకట రమణ, తాజ్‌ఉద్దిన, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శి జాని, తిరుమల రావు, శ్రీనివాస్ నాయక్, ఫ్లవర్స్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు మైముద్, సర్దార్, మోయిన్, ఖాజా, ఇంతియాజ్, బాబా, రంజాన్ అలీ తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్‌కు రాజీనామా…బిఆర్‌ఎస్‌లో చేరికలు
ఖమ్మంకార్పొరేషన్ : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్థానిక 42వ డివిజన్ నుండి 40 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి డివిజన్ నాయకులు, పాన్‌షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు మోసిన్, కాఫీల్, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఖమర్, ఆఫ్రోజ్ అధ్వర్యంలో మంత్రి తనయుడు డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీ లో చేరారు.