ప్రొటీన్లు కావాలంటే…!

If you want proteins...!ఆరోగ్యానికి ప్రొటీన్లు చాలా ముఖ్యమైనవి. ఇవి శరీరంలోని కణాలకు, కణజాలాలకు సమస్యలు వచ్చినప్పుడు వాటిని తిరిగి ఆరోగ్యవంతంగా చేయటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే అన్ని ఆహార పదార్థాలలో ప్రొటీన్లు ఒకే విధంగా ఉండవు. కొన్నింటిలో ప్రొటీన్లతో పాటు కొవ్వు కూడా ఉంటుంది. వీటిని తినటం వల్ల ప్రొటీన్లతో పాటుగా కొవ్వు కూడా చేరుతుంది. అందువల్ల ప్రొటీన్లు అదనంగా కావాల్సిన వారు కొన్ని రకాల ఆహారపదార్థాలు తినాలని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే…
గుడ్డు
ప్రొటీన్లు అదనంగా కావాల్సిన వారు గుడ్లను తప్పనిసరిగా తినాలి. వీటి ద్వారా లభించే ప్రొటీన్లను శరీరం వంద శాతం వినియోగించు కుంటుంది. అంతే కాకుండా వీటిలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
తోపు
సోయాబీన్లను బాగా నానపెట్టి, వాటి నుంచి తోపును తయారు చేస్తారు. తోపులో శరీరానికి తప్పనిసరిగా కావాల్సిన తొమ్మిది అమినో యాసిడ్స్‌ ఉంటాయి. అంతే కాకుండా దీనిలో ఐరన్‌, కాల్షియం కూడా ఎక్కువగానే ఉంటాయి. గుండె జబ్బులు, ఓస్టియో పోరోసిస్‌ వంటి వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా తినాల్సిన ఆహారమిది.
పిస్తా
పిస్తాలో ప్రొటీన్‌తో పాటు ఫైబర్‌ కూడా ఉంటుంది. ప్రతి రోజూ సాయంత్రం క్రమం తప్పకుండా కొన్ని పిస్తా పప్పులను తినటం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రొటీన్లు . లభిస్తాయని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.
పప్పుధాన్యాలు
పెసర్లు, బొబ్బర్లు, రాజ్మా వంటి పప్పుధాన్యాలలో ప్రొటీన్‌ చాలా ఉంటుంది. ఒక కప్పు పప్పుధాన్యాల్లో 18 గ్రాముల ప్రొటీన్‌, 15 గ్రాముల ఫైబర్‌ ఉంటుందని పౌష్టికాహార నిపుణులు పేర్కొం టుంటారు. రోజూ క్రమం తప్పకుండా పప్పు ధాన్యాలు తినే వారికి ఎటు వంటి హద్రోగ సమస్యలు రావు.