– మూడు స్థానాలు దిగజారి 27వ ర్యాంకుకు పడిపోయిన వైనం
న్యూఢిల్లీ : వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ర్యాంకు పడిపోయింది. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ 2023లో మేనేజ్‌మెంట్ విభాగంలో మూడు స్థానాలు దిగజారి 27వ స్థానానికి చేరుకున్నది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) కింద ర్యాంకింగ్‌ను హెచ్‌ఆర్డీ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసింది. గతేడాది ర్యాంకింగ్‌లో, ఐఐఎఫ్‌టీ 24వ స్థానంలో ఉండగా.. 2021లో 25వ స్థానంలో ఉన్నది. 2020లో 26వ స్థానంలో, 2019లో 31వ స్థానంలో ఉన్నది. ఎన్‌ఐఆర్‌ఎఫ్ 2015లో దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు ఆబ్జెక్టివ్ ప్రమాణాల ఆధారంగా ర్యాంక్ ఇవ్వడానికి అటువంటి సంస్థలలో పోటీ నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించబడింది.