– అబ్బురపరుస్తున్న చీరలు, డ్రెస్ మెటీరియల్స్
– వరంగల్ కార్పెట్స్, దుప్పట్లు
– చూపరులను ఆకట్టుకుంటున్న జ్యూట్‌లేదర్ బ్యాగులు, పట్టుబెంగాలీ, గద్వాల చీరలు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలోని ఎంపీటీ ఫంక్షన్ హా ల్లో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా మేళా ప్రజలను ఆక ట్టుకుంటుంది. తాండూరులో చేనేత హస్తకళా మేళా ఆధ్వ ర్యంలో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. పట్టణంలో ఈ నెల 5-20వ తేదీ వరకు తాండూరు పట్టణ కేంద్రంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో కొనసాగనుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో స్వయంగా చేతులతో తయారు చేసిన పలు వస్తు వులు అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. పోచంపల్లి, మంగళ గిరి, ఉప్పాడ, నారాయణపేట్, గద్దాల, ప్రొద్దుటూర్, మాధవవరం, పట్టుచీరలు, బెంగాలీ చీరలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వరంగల్‌లో తయారు చేసిన కార్పె ట్లు, డోర్ మ్యాట్లు, పలు రకాల రంగుల్లో అబ్బురపరుస్తు న్నాయి. మీరట్ బెడ్‌షీట్స్, హైదరబాద్ మంచి ముత్యాలు సారంగపూర్ ఉడెన్‌వేర్ బ్లాక్‌మెటల్ వెండి ఇత్తడి వస్తువు లు ఆకర్షణీయంగా ఉన్నాయి. జ్యూట్ లెదర్ బ్యాగులు వివిధ రంగుల్లో ఆకట్టుకుంటున్నాయి. చేనేత హస్తకళా ప్రదర్శన నిర్వాహకులు రంగస్వామీ మాట్లాడుతూ.. తాం డూరులో ఈ ప్రదర్శన ఈ నెల 20వ తేదీ వరకు ఉంటుం దన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పలు రకాల వస్తువులు ప్రదర్శనలో పెట్టారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు.