हैवानियत: लूटपाट के बाद कार से 200 मीटर तक घसीटा, रोंगटे खड़े कर देने वाला वीडियो वायरल#DelhiCrime #Kanjhawala #Mahipalpur @DelhiPolice pic.twitter.com/9YySYnoqQq
— Aakash Bhardwaj (@AakashB2021) October 11, 2023
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలో దారుణం జరిగింది. దొంగతనాన్ని అడ్డుకోబోయిన క్యాబ్ డ్రైవర్ని అత్యంత ఘోరంగా కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన ఢిల్లీలో మహిపాల్పూర్ ప్రాంతంలో జరిగింది. 43 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ బిజేంద్ర ఈ ఘటనలో తీవ్రగాయాలపాలై మరణించారు. ఫరీదాబాద్కి చెందిన బిజేంద్ర క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. క్యాబ్ నడుపుతున్న సమయంలో దొంగలు కారును దొంగిలించడానికి చూశారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బిజేంద్రను 200 మీటర్ల వరకు కారుతోనే ఈడ్చుకెళ్లారు. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో డ్రైవర్ తలకు బలమైన గాయమై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలైన బిజేంద్ర మరణించాడు. హత్య, సాక్ష్యాలు ధ్వంసం చేయడం వంటి అభియోగాల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ఆరు టీములతో పోలీసులు గాలిస్తున్నారు.