నిరసనగా వీవోఏ లు బతుకమ్మ నిర్వహణ..

– సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు – నాయకులు పుల్లయ్య.

నవతెలంగాణ – అశ్వారావుపేట : వీవోఏ లు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 33 రోజులు అయిన సందర్భంగా నిరసన బతుకమ్మ నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సంఘీ భావం సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఐ(ఎం) నాయకులు పుల్లయ్య మాట్లాడుతూ వీవోఏ లు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.గతం లో అనేక అసంఘటిత కార్మికులు పోరాటాలు చేయడం వల్లనే వారికి న్యాయం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అర్జున్,కాంగ్రెస్,తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.