యాలాల పీహెచ్‌సీలో మహిళా క్లినిక్‌ సెంటర్‌ ప్రారంభం

తెలంగాణ వైద్య ఆరోగ్య
దినోత్సవంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి
నవతెలంగాణ-యాలాల
యాలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధ వారం తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం పురస్క రించుకొని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా క్లినిక్‌ సెంటర్‌ను ఎంపీపీ తాళ్లపల్లి బాలేశ్వర్‌ గుప్తతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళల ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉం చుకుని ఏర్పాటుచేసిన ఉచిత ప్రత్యేక క్లినిక్‌ సెంట ర్‌ను మహిళలందరూ సద్వినియంగం చేసుకోవాలని తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా 22 రోజులపాటు రోజుకు కార్యక్ర మాన్ని ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ము ఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో ఇప్పటివరకు రాష్ట్రం లో జిల్లాలు, మండలాలు, గ్రామాలలో, ప్రజలకు సం క్షేమం, అభివృద్ధి, ప్రగతి ఫలాలు ఏమేరకు చేరాయో వివరించారు. వైద్య ఆరోగ్య రంగంలో ఇప్పటివరకు తెలంగాణ సాధించిన ప్రగతిని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎం హెచ్‌ఓ రవీందర్‌ యాదవ్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, పిహెచ్‌సి. వైద్యురాలు, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు రవీందర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి ఆకుల బస్వరాజ్‌, వైస్‌ ఎంపీపీ రమేష్‌, తాండూర్‌ ఏఎంసి డైరెక్టర్‌ ఆశన్నమెట్లీ, మాజీ సర్పంచ్‌ సాయిలు, కో ఆప్షన్‌ సభ్యులు అక్బర్‌ బాబా, శేఖర్‌ రెడ్డి, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.