– మైక్రోఫుుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అవకాశాలు
– రైతు ఉత్పత్తిదారు సంస్థలకు, స్వయం సహాయక బృందాలకు మద్దతు
– 35 శాతం రాయితీతో రూ. 10 లక్షల వరకు రుణాలు
– పీఎమ్‌ఎఫ్‌ఎమ్‌ఈ పథకం కింద దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
స్వయం ఉపాధి కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఔత్సాహికులను ప్రోత్సహియిస్తున్నాయి. రైతు ఉత్పతిదారులకు, స్వయం సహాయక బృందాలకు ప్రాధ్యానత్య కలిపిస్తూ ఆర్థిక సాయం అందిస్తోంది. రూ. 40 వేల నుంచి రూ.10 లక్షల వరకు బ్యాంక్ లింక్డ్ రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. స్వయం ఉపాధి అవకాశాలు పెంచేందుకు.. ఈ రుణ సదుపాయం దోహదపడనుంది. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు పీఎమ్‌ఎఫ్‌ఎమ్‌ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అర్హుత గల అభ్యర్థులకు 35 శాతం సబ్సిడీ అవకాశం కల్పించనుంది
ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు.. నిరుదోగ్యులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ కింద ప్రారంభించిన పీఎమ్ ఫార్మాలైజేషన్ ఆఫ్ మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు పర్చుతూ పేద, మధ్య తరగతి నిరుద్యోగులకు ఆర్థిక ప్రోత్సాహం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పీఎమ్‌ఎఫ్‌ఎమ్‌ఈ పథకం కింద అంకుర సంస్థలకు, వ్యక్తిగత, గ్రూపులకు మద్దతు ఇవ్వనుంది. బ్రాండింగ్ మార్కెటింగ్, బలమైన ప్రాజెక్టు మేనేజ్ మెంట్ ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేయడం కోసం ప్రోత్సాహకం అందిస్తోంది. వ్యక్తిగత సూక్ష్మ సంస్థలలకు ట్రైనింగ్, హ్యండ్ హెల్డింగ్ సపోర్టు అందిస్తోంది. ప్రతి స్వయం సహాయక బృందానికి రూ.40 వేల రుణం అందిస్తోంది. అర్హత కలిగిన వ్యక్తి గత మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టుకు రూ.10 లక్షల రుణం అందించనుంది. ఇందుకు సబ్సిడీ కింద రూ. 35 శాతం అందించనుంది.
పీఎమ్‌ఎఫ్‌ఎమ్‌ఈ పథకం కింద ప్రాజెక్టులు
బేకరి ఉత్పత్తులు, తృణధాన్యాలు, పప్పుధాన్యాల ఆధారిత ఉత్పత్తులు, సిట్రస్ ఆధారిత ఉత్పత్తులు, కొబ్బరి, కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు, మొక్కజొన్న ఉత్పత్తులు, పండ్ల ఆధారత ఉత్పత్తులు, వేరుశనగ, పాలు , పుట్టగొడుగు, పొడి వస్తువులు, నూనె గింజల ఆధారిత ఉత్పత్తులు కుసం నూనె, పొద్దుతిరుగడు, కొబ్బరి, నువ్వుల నూనె తయారీ యంత్రాలు, సుగంధ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాల ఆధారిత ఉత్పత్తులు ప్రాసెసింగ్ యాత్రలకు రుణ సౌకర్యం కల్పించనుంది.
అర్హత..
జౌత్సాహికులకు ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. వయస్సు 18 ఏండ్లు పై బడి ఉండాలి, వ్యక్తిగత, స్వయం సహాయక, ప్రయివేట్ లిమిటెడ్‌లు అర్హులు, ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలి, ప్రాజెక్టు నిర్మాణానికి 20 శాతం ఖర్చు చేసే ఆర్థిక స్తోమత ఉండాలి.
స్వయం ఉపాధికి పోత్సాహకాలు
11:58 pm