నవతెలంగాణ-ఓయూ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల్లో భా గంగా ”ఉస్మానియా యూనివర్సిటీలో వారసత్వ మెట్ల బా వుల పునరు ద్ధరణ” అనే అంశంపై సదస్సు నిర్వహి ంచారు. యూనివర్శిటీ ఎడ్యుకేషన్ కళాశాల ఆవరణలో ఉన్న పునరుద్ధరించిన మెట్ల బావిని సుందరంగా తీర్చి దిద్దారు.ఈ సందర్భంగా ఓయూ వీసీ ప్రో. రవిందర్ మెట్ల బావి కోసం పనిచేసిన కల్పనా రమేష్, ఆమె బంద సభ్యల కషిని అభినందించారు. పౌరుల అవ సరాలను తీర్చడానికి దిగుడు బావులను ఏర్పాటు చేయ డంలో మహాలకా బాయి దూరదష్టి ప్రయత్నాలను ఆయన గుర్తు చేసుకున్నారు. పునరుద్ధరణ పనులకు సహకరించిన ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధికారులకు కతజ్ఞతలు తెలిపారు. ఓయు రిజిస్ట్రార్ ప్రొ పి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి వనరులను ప్రజలు చూసే విధానాన్ని వివరించారు. ఓయూ విస్తీర్ణంలో మొత్తం ఏడు మెట్ల బావులు ఉన్నాయని, పునరుద్ధరణ ద్వారా నీటి వనరుల కోసం తిరిగి వాటిని వినియోగించుకోవాలని అన్నారు. కల్పనా రమేష్, ప్రెజెంటేషన్ చేసి ప్రేక్షకులను అమి తంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ ప్రో. రవీంద్రనాథ్ మూర్తి, ఈఎంఆర్సీ డైరెక్టర్ ప్రో. టి. మ ణాళిని, డాక్టర్ పి. శంకర్,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.