
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఎందరో స్వతంత్ర పోరాట యోధులు మహనీయుల త్యాగఫలమే ఈ స్వతంత్ర దినోత్సవం అని ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 77 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాసరెడ్డి జండా ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ పోరాటంలో అమరులైన వారి త్యాగాలను స్మరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, తహసిల్దార్ అల్లం రాజకుమార్, లతోపాటు ఎంపీటీసీలు సర్పంచులు ఉపసర్పంచులు గ్రామ పెద్దలు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.