
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నిజామాబాదు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా వృద్ధులకు ఉచిత సంచార వాహన వైద్య సేవలను నిజామాబాదు జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు మంగళవారం ప్రారంభించారు.రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటిస్, సీనియర్ సిటిజన్స్, భారత ప్రభుత్వ సహాకారంతో వృద్ధులకు ఇంటివద్దనే సేవలందించేందుకు సంచార వాహనం ఏర్పాటు చేయాలన్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ సంచార వాహన వైద్య శిబిరం ఏర్పాటు చేయనైనది. ఈ సంచార వాహనం ద్వారా వయో వృద్ధులకు బిపి., షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు.ఈ సంచార మెడికల్ వాహనం ద్వారా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు గ్రామ పంచాయితీ ముద్దక్ పల్లిలో డాక్టర్ ఆశిష్ రాజ్ గారు సుమారు 150 మందికి వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు చేసి ఫ్రీగా మందులు ఇవ్వడం జరిగింది. షుగర్ టెస్టులను మరియు తగిన సూచనలు కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మోపాల్ మండల చైర్మన్ వెంకటేశ్వరులు, బాబా శ్రీనివాస్, హెల్త్ ఎక్సటెన్షన్ ఆఫీసర్ రమేష్, పి.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణ ఆశా సిబ్బంది పాల్గొని విజయవంతం చెయ్యడం జరిగింది.