కన్నీళ్ళను సిరాగా రాసిన కవితలు
కష్టాల తోరణాలను
సాహితీ గుమ్మాన కట్టి వేస్తావి
జనాలను మనవాళ్లను చేస్తావి!
బాధల బావుల నుండి ఉద్వేగాలను తోడేస్తాయి
దశా దిశ లేనివాడికి చేతికి లక్ష్యా కంకణం అవుతావి!
తుప్పు పట్టిన చైతన్య కత్తిని
నిప్పులా కాల్చి పదను పడుతావి
మూలన ఉన్న చేతికర్రను చేదోడుగా నిలుపుతావి!
చిలికిన కన్నీరులో తిలకిస్తే
ఎన్నో రంగులను చూపుతావి
మాటను మౌనం లోంచి వచ్చిన
తూటాలా చేస్తావి!
కవితలు కష్టజీవికి ఇరువైపులా నిలుస్తాయి
అన్యాయాలను అక్రమాలను
సాగకుండా నిలదీస్తాయి!
చీకటి మార్గాన
దివిటీ అయి నడుస్తాయి
సమ సమాజానికి
కొత్త బాటలు వేస్తాయి!
– జగ్గయ్య.జి, 9849525802