నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలో ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు పంచాయితీ కార్యదర్శి డేగల శంకరయ్య తెలిపారు. శనివారం ఎన్టీఆర్ కాలనీ సమీప వీధుల్లో పిచ్చి మొక్కల తొలగింపు చేపట్టినట్లు అదేవిధంగా పంచాయతీ వ్యాప్తంగా మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో నీరు నిలువ లేకుండా చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిర్మానుష్యంగా పాటుపడిన ప్రదేశాలను గుర్తించి ప్రజలకు అనుకూలంగా మార్చనున్నట్లు అన్నారు. ఈనెల 22 వరకు కొనసాగి ఈ పారిశుధ్య కార్యక్రమాలలో ప్రజలు ప్రజాప్రతినిధులు సలహాలు సూచనలు శ్రమదానంతో విజయవంతంగా ముగించాలని సూచించారు.