– అధికారులు, నాయకులు వచ్చి చూసినా ఫలితం శూన్యం
– దోమలు, మురికి వాసనతో కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దామని, ప్రజ లకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని మౌలిక వసతు లూ కల్పిస్తామని నిత్యం వల్ల వేస్తున్న అధికార పార్టీ నాయ కులు, అధికారుల మాటలు నీటి మూటలుగానే మిగిలి పోతున్నాయి. దానికి ప్రత్యక్ష నిదర్శనం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని భారతి నగర్ డివిజన్‌లోని ఎంఐ జి కాలనీలో వర్షపు నీటి కోసం తవ్వి వదిలేసిన కాలువలో చేరిన మురికి నీటి గుంతనే నిదర్శనం. వర్షపు నీరు సాఫిగా వెళ్లడానికి పాత ఎంఐజీ కాలనీలో 1451 ఇంటి నెంబర్ వద్ద కాలువ తవ్వే క్రమంలో జేసీబీ తగిలి డ్రయినేజీ పైప్ లైన్ పగిలిపోవడంతో మురికి నీరు కాలువలో చేరి కంపు కొడుతుంది. వర్షపు నీరు వెళ్లే కాలువ నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంతో, నీరు పూర్తిగా బయటకు వెళ్ళిపోకుండా తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో నీరు కాలువలో నిలిచి పోయి మురికికూపంగా తయారయింది. ఈ సమస్యను కాలనీవాసులు రవీందర్ రెడ్డి, అనిల్ కుమార్, శ్రీధర్, ఇంది రా, మహేష్, విజరులు బీఆర్‌ఎస్ నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు వచ్చి పరిశీలించి వెళ్ళారే తప్ప సమస్యకు పరిష్కారాన్ని మాత్రం చూపలేకపోయారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నోసార్లు రాతపూర్వకంగా వినతి పత్రాలు సమర్పించి నప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం మొదలవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీరు పూర్తిగా నిలిచిపోవడంతో పాటు, డ్రయినేజీ నీరు కూడా కలవడంతో ప్రమాద కరమైన దోమ లు, ఈగలు, చేరి ప్రజల పాలిట శాపంగా మారాయని తెలి పారు. తమ కాలనీవా సుల నుండి అన్ని రకాల పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ సమస్యను పరిష్కరించడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదని, అధికారులకు, నాయకులకు ఇంత నిర్లక్ష్యం పనికిరాదని హితవు పలికారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షపు నీరు నిలువ ఉండకుండా సాఫీగా వెళ్లేలా చూడాలని, డ్యామేజ్ అయిన డ్రయినేజీ పైపులను మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. లేదంటే ఆందోళన చేపట్టాల్సి వస్తుందని కాలనీవాసులు హెచ్చరించారు.