నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర పర్యాటక, రాష్ట్ర పర్యాటక శాఖల ఆధ్వర్యంలో పర్యాటకం, ఆతిధ్య రంగాల నిర్వహణ కోర్సులకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐటీహెచ్‌ఎం) క్యాంపస్ హౌటల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎంబీఏ రెండేండ్ల కోర్సు, బీబీఏ నాలుగేండ్ల కోర్సు, బీఎస్సీ మూడేండ్ల కోర్సులకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎన్‌ఐటీహెచ్‌ఎం క్యాంపస్ సూచించింది. మరింత సమాచారం కోసం www.nithm.ac.in వెబ్‌సైట్‌లో చూడాలని పేర్కొంది. మరిన్ని వివరాలకు 9553700035, 7842455581, 9515241607 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించింది.