‘పీఎం శ్రీ’ రెండోదశకు దరఖాస్తుల ఆహ్వానం

– తుది గడువు 26
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రధాన మంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎం శ్రీ) పథకం రెండో దశకు ప్రభుత్వ పాఠశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో వాటి సమర్పణకు ఈనెల 26 వరకు తుది గడువు ఉందని పేర్కొన్నారు. 2021-22 యూడైస్‌ గణాంకాల ప్రకారం మొత్తం 4,930 పాఠశాలలను విద్యాశాఖ ఎంపిక చేసింది. వాటిలో 400 నుంచి 500 వరకు రెండో దశలో ఎంపిక చేసే అవకాశమున్నది. అయితే మొదటి దశలో 543 పాఠశాలలను విద్యాశాఖ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ పాఠశాలల అభివృద్ధికి అయ్యే ఖర్చులో మెజార్టీగా కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.