కరీంనగర్‌ తీగల వంతెన ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కరీంనగర్‌ పట్టణంలోని మానేరు వాగుపై నిర్మించిన తీగల వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావును మంత్రి గంగుల కమలాకర్‌ ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సిరిసిల్లలో ఆయన మంత్రి కేటీఆర్‌ను కలిసి, శుభాకాంక్షలు తెలిపారు.