తాండూరులో లక్షా 30 వేల ఎకరాలకు సాగునీరు

నవతెలంగాణ-తాండూరు
తట్టేపల్లి1 టీఎంసీ రిజర్వాయర్‌ ఏర్పాటుతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా తాండూరులోనీ లక్షా 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. తాండూరు పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు కలిసి శుక్రవారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు బోర్లు లేదా వానాకాలంపై ఆధారపడి మాత్రమే వ్యవ సాయం చేసే మన తాండూరు ప్రాంతానికి పాల మూరు-రంగారెడ్డి ద్వారా సాగునీరందిం చేందుకు సీఎం కేసీఆర్‌ కషి చేస్తున్నట్టు చెప్పారు.
తట్టేపల్లి1 టీఎంసీ రిజర్వాయర్‌ ఏర్పాటుతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా తాండూరులోనీ లక్షా 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ ను అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ ఎన్జీటీ, ట్రిబ్యునల్‌, సుప్రీం కోర్టు వెళ్లి ఎన్నో అడ్డంకులు సృష్టించిందన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ మొక్కవోని దీక్షతో వాటన్నిటినీ అధిగమించి అనుమతులు సాధించారని తెలిపారు. ఇది మన రైతులందరి విజయం అన్నారు.ఈ ఎత్తిపోతల పథకంతో పర్యావరణ అనుమతుల మంజూరుకు ఈఏసీ గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.