పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో తాండూరులో లక్ష ఎకరాలకు సాగునీరు

– ప్రాజెక్ట్‌పై కుట్రతో ఎన్నో కేసులు వేసి అడ్డగించిన కాంగ్రెస్‌
– సీఎం కేేసీఆర్‌ అడ్డంకులను అధిగమించి దశాబ్దాల కలను సాకారం ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి
నవతెలంగాణ-తాండూర్‌ రూరల్‌
పాలమూరు-రంగారెడ్డి ఎతిపోతలతో తాండూరులో లక్ష ఎకరాలకు సాగునీరు అందు తుందని ఎమ్మెల్యే ఫైలెట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన 250 మంది యువకులు, గ్రామస్తులు నాయకులు ఆర్‌సీ గౌడ్‌, హసన్‌ పటేల్‌, రఘుగౌడ్‌, కోఆప్షన్‌ సభ్యులు శంషోద్ధిన్‌ ఆధ్వ ర్యంలో ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు సవతి తల్లి ప్రేమ చూయించి తాండూరును వెనకబాటుకు గురి చేశారని విమర్శించారు. అభివృద్ధి పనులు, బీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలను చూసి పలువురు ఆకర్షణీయులు అవుతున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతోందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేదనీ మూడోవసారి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజుగౌడ్‌, పార్టీ మండలాధ్యక్షులు రాందాస్‌, సీనియర్‌ నాయకులు ఉమాశంకర్‌, విజరు, శేఖర్‌, సర్పంచుల సంఘం అధ్యక్షులు రాములు, ఎంపీటీసీ సాయిరెడ్డి తదితరలు పాల్గొన్నారు.