మెడికల్‌ పోస్టుల భర్తీ పారదర్శకంగా జరిగేనా?

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలో 21 మెడికల్‌ ఆఫీసర్ల పోస్టుల భర్తీ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది వరకే 21 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వగా ఆయా జిల్లాల వారీగా నియామకానికి తేదీలను ప్రకటించారు. నియామక ప్రక్రియలో ఆర్‌సీ సాక్స్‌ ప్రతినిధి పాల్గొనాల్సి ఉండగా, ఆయా జిల్లాల వారినే భర్తీ చేసుకోవాలని చెబుతున్నట్టు సమాచారం. దీంతో అర్హులైన అభ్యర్థులకు కాకుండా అనర్హులతో పోస్టుల భర్తీ చేస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు.