కష్టాలు పెట్టె కాంగ్రెస్‌ మళ్లీ అవసరమా

– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
– ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో రోడ్‌షో
– కిషన్‌రెడ్డి ప్రచారానికి ప్రజల బ్రహ్మరథం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
50 ఏండ్ల పాటు కష్టాలు పాలు చేసిన కాంగ్రెస్‌ మళ్లీ అవసరమా అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసి కష్టాలుకొని తెచ్చుకోవద్దన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని తులేకలాన్‌, ఎలిమినేడు, కప్పాడు, తుర్కగూడ, చెర్లపటేల్‌గూడ, కర్ణగూడ, పోచారం, ఉప్పరిగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన రోడ్‌షోకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే కష్టాలు తప్పవన్నారు. విజన్‌ కలిగిన బీఆర్‌ఎస్‌ను మరోసారి గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే గ్రామ పంచాయతీలకు పెద్దపీఠ వేశారని గుర్తు చేశారు. బీఆర్‌ఎన్‌ ప్రభుత్వం వస్తే రూ.400లకే గ్యాస్‌ సిలిండర్‌, రూ.5,016 ఆసరా పింఛన్‌, రూ.16000 రైతుబంధు సాయం, రూ.3000 సౌభాగ్యలక్ష్మీ పథకం అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఈ ప్రాంతంలో సాగునీటిని సాధిస్తామని చెప్పారు. లక్ష ఎకరాలకు సాగునీటిని అందించి తీరుతమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకున్నామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేష్‌, ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షులు భరత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ అధ్యక్షులు బుగ్గరాములు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు బూడిద రాంరెడ్డి, మండల కార్యదర్శి బాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీలు నాగటి నాగమణి, సర్పంచ్‌ అశోకవర్థన్‌ రెడ్డి, కత్తుల పవిత్రకుమార్‌, హంసమ్మ, మహేందర్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు ఏనుగు బుచ్చిరెడ్డి, ఏనుగు నలేందదర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.