పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ యుద్ధం ఆపి చర్చలు జరపాలి

– సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేష్‌
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధాన్ని ఆపి చర్చలు జరపాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్‌ అన్నారు. శనివారం సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేష్‌ మాట్లాడారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధాన్ని అమాన వీయ చర్య అని, యుద్దాన్ని వెంటనే ఆపాలని డిమా ండ్‌ చేశారు. పాలస్తీనీయన్లు వారి సొంత గడ్డపైనే పరాయివారైపోయారని అన్నారు. పాలస్తీనాను ఇజ్రా యెల్‌ ఆక్రమించుకుంటుందని తెలిపారు. హమస్‌ దాడిని సాకుగా చేసుకొని గాజాలోని సామాన్య పాలస్తి నీయన్లను చంపేస్తుందని అన్నారు. పాలస్తీనాకు సంఘీభావంగా సీఐటీయూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నదని తెలిపారు. అమెరికా అండతో పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధకాండ, అమానుష దాడులను తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయిల్‌ ఈనెల ఏడు నుంచి పాలస్తీనాపై దాడులను ప్రారంభించిందని తెలిపారు. ఈ దాడులను తక్షణమే నిలిపేయాలంటూ ఐక్యరాజ్య సమితి అనేక తీర్మానాలు చేసినప్పటికీ, అమెరికా తన వీటో అధికారాన్ని ఉపయోగిస్తూ, కుట్రలకు తెగబడిందని విమర్శించారు. వేలాది మంది పాలస్తీనియన్లను హత్య చేసిందని పేర్కొన్నారు. పాఠశాలలు, ఆస్పత్రులపై సైతం దాడులు చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి ఆహారం, తాగునీరు అందకుండా చేయడమే కాక ఇతర దేశాలు పాలస్తీనాకు పంపుతున్న సహాయాన్ని కూడా అందకుండా చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే మూడు వేల మంది చిన్నారులతో సహా ఏడు వేల మంది మరణించారని వివరించారు. 10 వేలకు పైగా గాయాలపాలయ్యారని తెలిపారు. లక్షల సంఖ్యలో శరణార్దులుగా మారారని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఈ యుద్ధాన్ని ఖండిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి శివమ్మ అధ్యక్షత వహించగా సీఐటీయూ పట్టణ కో కన్వీనర్‌ మర్లపాటి రేణుక, పట్టణ నాయకులు జి.లక్ష్మన్‌, పి.సంతోష్‌, శువమ్మ, రమాదేవి, పద్మ, నాగమణి, ఆదిలక్ష్మి, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.