– కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
– సుంకిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు యువ నాయకులు
నవతెలంగాణ-ఆమనగల్
రాబోయే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురడం ఖాయమని ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆమనగల్ పట్టణంలోని ఐక్యత ఫౌండేషన్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని ముర్తూజపల్లి గ్రామానికి చెందిన ఆయా పార్టీల యువ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం గ్రామ గ్రామాన గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా చేపడుతున్నట్టు సుంకిరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో శివ, నరేందర్, మల్లేష్, శ్రీను, చంద్రశేఖర్, మహేష్, కొండల్, వీరయ్య, రాజేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.