– పాలేరు బీఆర్‌ఎస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి
నవతెలంగాణ- నేలకొండపల్లి
నియోజకవర్గంలోని దళితులందరికీ దళిత బంధు ఇచ్చే బాధ్యత నాదని, కారు గుర్తుకు ఓటేసి ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పాలేరు బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి కోరారు. మంగళవారం మండలంలోని అనాసాగరం, సదాశివపురం, రామచంద్రపురం, సూర్దేపల్లి, పైనంపల్లి, భైరవునిపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని ఆయన విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు డబ్బు వాయిద్యాలు, కోలాట నృత్యాలు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఆయా గ్రామాలలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల సభలలో ఆయన మాట్లా డుతూ గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని, పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో ప్రజలు ఊహించని అభివృద్ధి ముఖ్య మంత్రి కేసీఆర్ సారథ్యంలో కొనసాగిం దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమవతుందన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచి అందరికీ స్ఫూర్తిగా నిలిచిందన్నారు. మరింత అభివృద్ధి కొనసాగాలంటే మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేయాలన్నారు. సదాశివపురం గ్రామంలో జరిగిన సభలో మాట్లాడుతూ గ్రామంలో మీరు ఏ పని అడిగినా కాదనకుండా చేశానన్నారు. తొలుత నేలకొండపల్లి మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన 21 కుటుంబాలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో వారికి గులాబీ కండువాలను కప్పి ఆహ్వానిం చారు. కార్యక్ర మంలో పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, కార్యదర్శి ఎన్నబోయిన శ్రీను, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నంబూరి శాంతకుమారి, సిడిసి చైర్మన్ నెల్లూరి లీలప్రసాద్, రైతుబంధు సమన్వయ సమితి మండల కన్వీనర్ శాఖ మూరి సతీష్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు గండు సతీష్, సర్పంచులు రాయ పూడి నవీన్, పాపినేని కరుణశ్రీ, యాతాకుల లక్ష్మి, తోళ్ళ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు షాక్…బీఆర్‌ఎస్‌లోకి వంద కుటుంబాలు
తిరుమలాయపాలెం: మండల పరిధిలోని బీరోలు గ్రామానికి చెందిన వంద కుటుంబాలు కాంగ్రెస్ నుండి బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పాలేరు బీఆర్‌ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందరెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కందాళ ఉపేందర్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధితో పాటు ఆయన వ్యక్తిగత సహాయ సహకారాలకు ఆకర్షితులమై బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఈ గ్రామం నుండి త్వరలో మరిన్ని చేరికలు ఉన్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు వంచర్ల సత్యనారాయణరెడ్డి, డాక్టర్ శ్రీధర్, కొప్పుల శ్రీనివాస్‌రెడ్డి, కొత్తపల్లి సత్తిరెడ్డి, కోట అశోక్‌రెడ్డి, బండారు దేవందర్‌రెడ్డి, కృపానందం తదితరులు పాల్గొన్నారు.