రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి పేదవారికీ అందేలా చూడాలి

– మండల సర్వసభ్య సమావేశంలో విప్‌ రేగా
నవతెలంగాణ-మణుగూరు
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో రేగా కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొని శాఖల వారిగా పనితీరును సమీక్షించారు. అటవీ శాఖ అధికారులు పోడు భూములలో ట్రెంచ్‌ కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టాలిస్తా ఉంటే ఫారెస్ట్‌ అధికారులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. విద్యుత్తు సమస్యపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు బాధ్యతగా పనిచేయాలి అన్నారు. వర్షాకాలం సీజన్‌ సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి పరిశుభ్రం చేయాలన్నారు. పోడు భూములకు త్వరలో పోడు పట్టాలు అందజేస్తామన్నారు. రైతుబంధు జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు జరిగే దశాబ్ది ఉత్సవాలలో పదేళ్ల ప్రగతి గ్రామాలలో కార్యక్రమాలు చేయాలన్నారు. ప్రజల భాగ్యస్వామ్యంతోని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో ముందడుగు వేయాలన్నారు. మిషన్‌ భగీరథ అధికారుల పనితీరును వారు ప్రశంసించారు. ఈ సమావేశంలో తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీవో చంద్రమౌళి, జడ్పీటీసీ నరసింహారావు, వైస్‌ ఎంపీపీ కరివేద వెంకటేశ్వరరావు ( కె.విరావు), గుడిపూడి కోటేశ్వరరావు, మచ్చ సమక్క, సర్పంచులు బచ్చల భారతి, బొగ్గం రజిత పాల్గొన్నారు.