– కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించిన గిరిజన సంఘాల నేతలు
నవతెలంగాణ-ఖమ్మం
జిల్లాలో నాలుగు లక్షల మంది గిరిజనుల సంక్షేమం అభివృద్ధి విద్య, వైద్యం, ఉపాధి సౌకర్యాలు, కల్పనకు గిరిజన తండాలు, గిరిజన గుడాల సమగ్ర అభివృద్ధికి జిల్లా కేంద్రంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఐటిడిఏ ఏర్పాటు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ వి.పీ గౌతమ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గి కష్ణ లు మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతంతో పాటు ఏజెన్సీ మండలాలు జిల్లాలో ఉన్నాయని అత్యధికంగా గిరిజనులకు ఐటీడీఏ లేకపోవడంతో ఎలాంటి సంక్షేమ ఫలాలు అందటం లేదని తెలిపారు. ఉన్న భద్రాచలం ఐటిడిఏ ద్వారా ఖమ్మం జిల్లా గిరిజనులకు ఎలాంటి ప్రయోజనం లేదని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఐటిడిఏ ఏర్పాటు సంబంధించిన అంశాలు చర్చించి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ స్పందిస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ఐటిడిఏ ఏర్పాటు అంశాన్ని తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఐటిడిఏ పర్యవేక్షణలో ఉన్న ఆశ్రమ పాఠశాలలు సమస్యలు పరిష్కారానికి ఐటీడీఏ అధికారుల ద్వారా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు తెలిపారు. వినతి పత్రం అందించిన వారిలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నున్నా నాగేశ్వరరావు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు వజ్జా రామారావు, జిల్లా సహాయ కార్యదర్శి భూక్య కృష్ణ నాయక్, భూక్య రమేష్, జాటోత్ కిషన్ నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు, మల్లమ్మ, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
15వ బెటాలియన్‌లో ఐలమ్మ జయంతి
సత్తుపల్లి రూరల్ : 15వ ప్రత్యేక పోలీసు పటాలము, బి.గంగారం, సత్తుపల్లి నందు చిట్యాల ఐలమ్మ128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పటాలపు కమాండెంట్ పి.వెంకట్ రాములు పాల్గొని చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు సహాయ దళాధిపతులు ఆర్.నాగేశ్వర రావు, యం.శ్రీనివాస రావు పాల్గొన్నారు.