జాగృతి సాహిత్య

పురస్కారానికి ఎన్‌ గోపీ ఎంపిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారత జాగృతి సంస్థ ఇచ్చే ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ విశిష్ట సాహిత్య పురస్కారానికి డాక్టర్‌ ఎన్‌ గోపి ఎంపికయ్యారు. జూన్‌ 21వ తేదీ ఉదయం అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో జరిగే కార్యక్రమంలో భారత జాగతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డును భారత జాగృతి సంస్థ ఈ ఏడాదే ప్రవేశపెట్టింది. ఆ సంస్థ ఇచ్చే తొలి అవార్డును ఎన్‌ గోపీ అందుకోనున్నారు. ఆయన ఇప్పటి వర కు 56 పుస్తకాలు రచించారు. వాటిలో 26కవితా సంకలనాలు,7వ్యాస సంక లనాలు, 5 అనువాదాలు ఉన్నాయి.ఆయన రచనలు అన్ని భారతీయ భాషల లోకి అనువాదం అవడంతో పాటు జర్మన్‌, పర్షియన్‌, రష్యన్‌ వంటి భాషలలో కి కూడా అనువాదం అయ్యాయి. ఆయన తెలుగు యూనివర్సిటీకి వైస్‌ చాన్సలర్‌గా, కాకతీయ, ద్రవిడ యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీగా పనిచేశారు.