జంధ్యాల తెలుగు తెరకు అందించిన రత్నాలు ప్రదీప్

నవతెలంగాణ – హైదరాబాద్
దక్షిణ భారత వాగ్గేయకారుడు అన్నమాచార్య వేల కీర్తనాలలో కొన్నిటిని తీసుకుని ప్రముఖ నాట్య గురువు తరంగిణి తన శిష్య బృందం తో శ్రీనివాస కళ్యాణం నృత్య రూపకం కూచిపూడి నృత్య శైలి లో దృశ్య కావ్యం గా ప్రదర్శించారు. శ్రీ త్యాగరాయ గాన సభ ప్రధాన వేదిక పై నట రాజ నృత్య సమితి తృతీయ వార్షికోత్సవం నృత్య భరితంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ నాట్య గురువు డాక్టర్ ఏలేశ్వరపు చలపతి శాస్త్రి పాల్గోని మాట్లాడుతూ తరంగిణి శిక్షణ లో శిష్యులు పరిణతి నర్తనం తో కూచిపూడి నృత్య ప్రాభవాన్ని చటారన్నారు. పోలీస్ ఉన్నతాధికారి రామదాసు తేజావత్ మాట్లాడుతూ నాట్యం ఏకాగ్రత క్రమశిక్షణ నేర్పుతాయని ఇందుకు నిదర్శనంగా తరంగిణి శిష్యులు ఐదేళ్ల పాప కూడా ప్రతిభతో నర్తించారన్నారు. సంస్థ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ స్వాగతం పలుకుతూ తమ సంస్థ మూడు సంవత్సరాల ఆనతి కాలం లొనే ఎందరినో శాస్ట్రీయ నృత్య కళాకారిణిలు గా సమాజానికి అందించిందన్నారు.