
రైతులకు గిట్టుబాటు ధరపై పోరాటానికి సిద్ధం కండని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం
తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు నిజాంబాద్ లోని తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో జరుపుకోవాడం జరిగింది క్లాసులో ప్రారంభ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సీనియర్ నాయకులు గంగాధరప్ప గారు జెండా ఆవిష్కరణ చేశారు ప్రారంభ సూచికగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగారెడ్డి గారు ప్రభుత్వ పథకాలు సంఘం పని క్లాసును బోధించారు కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందని బడిదారులకు పెద్దపీట వేసి రైతంగానే కార్పొరేట్లకు అప్పనంగా అప్పచెప్పుతుందని రానున్న రోజుల్లో రైతు గిట్టుబాటు ధర కోసం స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని రైతులందరినీ ఏకం చేసి మరో పోరాటానికి సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం రెండో క్లాసు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్ మాట్లాడుతూ సంఘం చరిత్రను బోధించి పాలకుల విధానాలు పెట్టుబడేదారులకే పెద్దపీట వేస్తాయని సన్న చిన్న కారు రైతులను ఆదుకోవడానికి సిద్ధపడటం లేదని అన్నారు ప్రభుత్వం రుణమాఫీ డబ్బులు మాఫీ చేస్తున్నమై అని చెప్పినప్పటికిని వడ్డీ కట్టాలని రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు పూర్తిగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఈ క్లాసులకు రెండు రోజులపాటు ప్రిన్సిపాల్ గా మోతి రామ్ నాయక్ వ్యవహరించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు తోగటి భువనేశ్వర్, దేవేందర్ సింగ్, జిల్లా సహాయ కార్యదర్శి నేరేడు గంగామణి, నాగరాజు, దేవుని రాజన్న, పద్మ,, సాయిలు, గణేష్, తదితరులు పాల్గొన్నారు.