నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి కోరారు. శనివారం శాసనమండలిలో ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ బిల్లు – 2022ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, టీవీవీపీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విలీనమంటే చట్టం రద్దు చేయాలి
టీవీవీపీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే దానికి సంబంధించిన చట్టాన్ని రద్దు చేయాల్సి ఉంటుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.