బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ బీ.ఎన్‌.రావు, వివిధ జిల్లాల అధ్యక్షులు, వైద్యులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, గంగుల కమలాకర్‌, ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మెన్‌ వినోద్‌ కుమార్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధినీ, కేంద్రంలో బీజేపీ సర్కార్‌ వైఫల్యాలను వివరించారు.