జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే కు జిపి కార్మికుల వినతి పత్రం అందజేత..

నవతెలంగాణ- మద్నూర్ 
మద్నూర్ మండలంలోని పెద్ద ఎకరా గేటు వద్ద నూతనంగా మంజూరైన విద్యుత్ సబ్స్టేషన్ భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే హనుమంతు షిండే కు సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ  ఆధ్వర్యంలో మద్నూర్ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ డిమాండ్లతో కూడిన ఒక వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ ఎమ్మెల్యేకు విన్నవిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు, ఎర్రబెల్లి, దయాకర్ రావు,  గారి దృష్టికి మా వినతి పత్రం తీసుకువెళ్లి వారితో మాట్లాడి మా డిమాండ్లు పరిష్కారం కావడానికి కృషి చేయాలని  విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కార్మికులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు. ఎం తులసిరామ్, జై మారుతి, మండలంలోని వివిధ గ్రామపంచాయతీ కారోబార్లు, వాటర్ మాన్, ఎలక్ట్రిషన్ మ్యాన్, ట్రాక్టర్ డ్రైవర్స్, పారిశుద్ధ్య కార్మికులు  పాల్గొన్నారు.