ఆడబిడ్డలకు సర్కార్ కానుక కళ్యాణలక్ష్మి

– ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
నవతెలంగాణ – గంగాధర : సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆడబిడ్డలకు సర్కార్ కానుక కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండలానికి చెందిన 51 మంది లబ్దిదారులకు 51,05,916 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ సబ్బండ వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. 2014 ముందు పేదింటి తల్లిదండ్రులు ఆడబిడ్డలను భారంగా బావించే వారని, కల్యాణలక్ష్మి పథకం అమలుతో ఆ భారం లేకుండా పోయిందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం పని చేస్తుందనే విషయం ప్రజలు గ్రహించాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని, కరోనా లాంటి సంక్షోభంలోనూ సీఎం కేసీఆర్ సంక్షేమానికే పెద్ద పీట వేశారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలతో పేదలను అక్కున చేర్చుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ప్రజలకు మౌళిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరాం మధుకర్, ఏఎంసీ చైర్మన్ లోకని ఎల్లయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్ రావు, సర్పంచులు శ్రీమల్ల మేఘరాజ్, కనకయ్య, ఎంపీటీసీ ఆట్ల రాజిరెడ్డి, నాయకులు వేముల అంజి, అజయ్, శ్రీనివాసరెడ్డి, తోట మహిపాల్, తహసీల్దార్ సదానందంపాల్గొన్నారు.