పట్టణ నూతన బీఆర్ఎస్ అధ్యక్షునిగా కంబగోని సుదర్శన్ గౌడ్

నవతెలంగాణ-రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా మాజీ జెడ్పిటిసి కంబగోని సుదర్శన్ గౌడ్ ను సోమవారం క్యాతనపల్లి లోని బాల్క సుమన్ స్వగృహంలో నియమించారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి అబ్దుల్ అజీజ్ రాజీనామా చేసారు. అతని స్థానంలో నియమితులయ్యారు. అలాగే యువజన విభాగం అధ్యక్షుడిగా లడ్డు రాకేష్ ను నియమించారు. వీరి ఇరువురి కి బాల్క సుమన్ శుభాకాంక్షలు తెలిజేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కాసుమన్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే పట్టణ సోషల్ మీడియా ఇంచార్జ్ కొండకుమార్, పలువురు బీఆర్ఎస్ పార్టీ యువకులు శుభాకాంక్షలు తెలియజేశారు.