పట్టణాభివృద్ధికి కృషి

– కౌన్సిల్‌ సమావేశంలో చైర్మెన్‌ భార్గవ్‌
నవతెలంగాణ-మిర్యాలగూడ
పట్టణ అభివద్ధికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మెన్‌ తిరునగర్‌ భార్గవ్‌ తెలిపారు. గురువారం సుందరయ్య పార్కులు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పన కోసం కృషి చేసినట్టు తెలిపారు. రోడ్లు, డ్రెయినేజీ, వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 15వ ఆర్థిక ప్రణాళిక నిధులు అన్ని వార్డులకు సమానంగా కేటాయిస్తామని తెలిపారు. అనివార్డుల అభివద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 16న ఏఆర్సి ఫంక్షన్‌ హాల్‌లో జరిగే పట్టణ ప్రగతి దినోత్సవం జయప్రదం చేయాలని కోరారు. అన్ని వార్డుల నుండి జన సమీకరణ చేయాలని కోరారు. 24వ వార్డు కౌన్సిలర్‌ కుందూరు నాగలక్ష్మి ఆత్మహత్య పట్ల కౌన్సిల్‌ సమావేశం సంతాపం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్ర సాగర్‌, వైస్‌ చైర్మన్‌ కుర్ర విష్ణు, డీఈ సాయి లక్ష్మి, టీపీఎస్‌ సోమయ్య, మున్సిపల్‌ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.