ఎల్లయ్య కుటుంబానికి కత్తి కార్తీక పరామర్శ

నవతెలంగాణ -దుబ్బాక రూరల్
అక్బర్ పేట్ భూంపల్లి మండలం పరిధిలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర ఎల్లయ్య (65) ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తిక గౌడ్  మంగళవారం వారి కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త దేవి రెడ్డి(బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దుబ్బాక), మంతూరి బాబు, మంతూరి ప్రసాద్,తీగల స్వామీ గౌడ్, సర్వెగరి. నర్స గౌడ్,జంగి బిక్షపతి, గుజెట్టి. బాలయ్య, బొగ్గులఅనుదీప్, ఎల్లం,రాజేశం, “టిపిసిసి మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ” కర్నాల్ శ్రీనివాసరావు,మిద్దె భూపాల్ గౌడ్(సిద్దిపేట్ జిల్లా సేవాదళ్ కార్యదర్శి),ఐరేని సాయి తేజ గౌడ్,కుస బీరయ్య,జిగురు మల్లేశం,చిగురు కనకయ్య తదితరులు పాల్గొన్నారు.