కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

నవతెలంగాణ -పెద్దవూర: నిరుద్యోగ యువతను మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని నాగర్జున సాగర్ నియోజకవర్గ ఎస్టీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ పాల్తి శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. గురువారం మండలం లోని తుమ్మచెట్టు ఎక్స్ రోడ్డులో విద్యార్థుల ముఖ్య నాయకుల సమావేశంలో. మాట్లాడారు గత ఎన్నికల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసినా కేసీఆర్ ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడని ప్రశ్నించారు. ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యం ఉపాధి తప్ప ఏ ఉచిత పథకాలు అవసరం లేదు. కానీ ఈసారి నోముల భగత్ గారికి ఓడించడమే గిరిజనుల ఎజెండా అన్నారు. ఈ సమావేశంలో చలకుర్తి మాజీ సర్పంచ్ రామవత్ సీతారాం నాయక్, లంబాడి విద్యార్థి సేన అధికార ప్రతినిధి రమవత్ దత్తు నాయక్ రమావత్ అశోక్ నాయక్, పాల్తి రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు.