– శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రాన్ని ఆకుపచ్చని తెలంగాణ మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహిచిన హరితోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఆవరణంలో ఆయనతో పాటు డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాష్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ప్రభుత్వ విప్ ఎమ్.ఎస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేది గతంలో ఒక నినాదంగానే ఉండేదనీ, తెలంగాణ వచ్చాక అది ఆచరణ రూపంలోకి వచ్చిందని తెలిపారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం 2015 నుండి 21 మధ్య రాష్ట్రంలో ఫారెస్ట్ కవర్ 6.85 శాతం పెరిగిందనీ, గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్ నేడు గ్రీన్ సిటీగా రూపొందిందని చెప్పారు.