దిగులు వద్దు.. టవర్లు ఎక్కవదు

– మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ పాకల వార్ విజయ్ జిపి కార్మికులకు హామీ
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఒక్క ఉద్యోగికి న్యాయం చేకూరే విధంగా అన్ని రంగాల కార్మికులకు క్రమిబద్దీకరణ యువచనలో ముందుకు సాగుతున్నారని పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి పరిష్కార మార్గం కనుగొంటారని జీపీ కార్మికులు దిగులు చెందకుండా ఎలాంటి హానికరమైన ఆందోళనలు చేపట్టవద్దని టవర్లు ఎక్కడం జరగరానిది జరిగితే ఏ కార్మికుడైన ఎలాంటి హామీకి గురికాకూడదని సింగిల్ విండో మాజీ చైర్మన్ పాకల వార్ విజయ్ కార్మికులకు హామీ ఇచ్చారు. జిపి కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేలా ఆందోళనలను ఉదృతం చేస్తూ మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం ఆవరణంలో గల సెల్ఫోన్ టవర్ ని ఎక్కి ఆందోళన చేశారు అనంతరం మద్నూర్ గ్రామ సర్పంచ్కు మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్యకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. తమకు న్యాయం చేకూరేలా ప్రభుత్వానికి నివేదిక అందించి వెంటనే పరిష్కరించాలని జీకే కార్మికులు వినపత్రాన్ని అందజేస్తూ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వినతి పత్రం కార్యక్రమంలో పాల్గొన్న మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ పాకల వార్ విజయ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ శాఖల కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక్కొక్కరికి క్రమీబద్దీకరణ అమలు చేస్తున్నారని జిపి కార్మికులు కూడా న్యాయబద్ధంగా కోరడం సరైనని మీ సమస్యలు కూడా ముఖ్యమంత్రి ఆలోచిస్తారని ఎలాంటి హానికరమైన పనులు చేపట్టకూడదని కార్మికులకు ఉద్బోధించారు. జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి అసెంబ్లీ సమావేశంలో బాజిరెడ్డి గోవర్ధన్ లేవనెత్తారని దానికి ముఖ్యమంత్రి తప్పకుండా ఆలోచిస్తారని కార్మికులకు న్యాయం చేకూరుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులు వాటర్ మెన్లు కారోబార్లు తదితర విధుల నిర్వహించే కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.