
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస సుభాష్ అన్నారు. రైతు రుణమాఫీ నిర్ణయాన్ని హర్షిస్తూ శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల హామీగా ఉన్న రైతు రుణమాఫీతో పాటు మిగిలిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా, నిరంతర విద్యుత్తు సీఎం కేసీఆర్ అందిస్తున్నారని పేర్కొన్నారు .విత్తనాలు ఎరువుల కొరత లేకుండా చూస్తున్నారని, రైతుల భూములకు ధరణి వెబ్సైట్ ద్వారా రక్షణ కల్పిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన రజనీ తిరుపతి రెడ్డి, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వంగ వెంకట్రాంరెడ్డి,, సర్పంచ్ లు ,ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.