నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శనివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో గ్రూప్-ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈనెల 19న ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీ చేసిన సంగతి విదితమే.ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ఈ అంశంపై కేజ్రీవాల్ ఇప్పటికే పలువురు విపక్ష నేతలను కలిసి మద్దతు కోరిన సంగతి తెలిసిందే.