– రోడ్ షోలో బీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ
నవ తెలంగాణ – ఖమ్మం కార్పొరేషన్
కనీస సౌకర్యాలు కూడా కరువైన ఖమ్మం ఒకప్పుడు ఎట్లుండే.. నేడు అన్ని సదుపా యాలతో అభివృద్ధి చేసిన ఖమ్మం ఇప్పుడు ఎట్లుంది అని ఖమ్మం బిఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం నగరంలోని 39, 40, 41, 42, 46, 47, 48వ డివిజన్ నందు బిఆర్‌ఎస్ శ్రేణులు అధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షో ద్వారా పువ్వాడ ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్ధించారు.ఒకప్పుడు ఖమ్మం నగరంలో 2వేలు ఉన్న గజం నేడు 20వేలకు పెరిగిందని, అందుకు కారణం మనం చేసిన అభివృద్దే అన్నారు. ఖమ్మం నగరం ఇంకా అభివృద్ది చెందుతుందని, రాబోయే రోజుల్లో హైద్రాబాద్ తరువాత ఖమ్మం నగరం అంత అభివృద్ది జరుగుతుందన్నారు.ఇవన్నీ మనం సాధించుకున్న ప్రగతికి నిదర్శనమని, మళ్ళీ ఇవన్నీ ఇలానే కొనసాగాలంటే కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలోఎంపీ నామా నాగేశ్వరరావు, మేయర్ పునుకోల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, బిఆర్‌ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి షేక్.షకీనా, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్‌జెసి కృష్ణ, బిఆర్‌ఎస్ పార్టీ నాయుకులు, గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలిస్ వెంకన్న పాల్గొన్నారు.
టెక్నాలజీతో చిల్లర రాజకీయాలు
ఖమ్మంకు, ప్రజలకు చేసింది ఏమీ లేక, నన్ను ఎదుర్కోలేకనే టెక్నాలజీ సాయంతో నేను దూషించినట్లుగా సోషల్ మీడియాలో ఫేక్ వాయిస్ రికార్డ్‌లు పోస్ట్ చేసి చిల్లర రాజకీయాలకు తెరలేపడం విచారకరమని ఖమ్మం బిఆర్‌ఎస్ అభ్యర్ధి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మం 4వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం పాండురంగాపురంలో దండా రాజశేఖర్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో అయన మాట్లాడుతూ నన్ను నేరుగా ఎదుర్కొనలేకనే ఇలాంటి దిగజారుడు రాజకీ యాలకు కాంగ్రెస్ పార్టీ తెర లేపిందని ఆరోపించారు. సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించి నా వాయిస్‌తో కార్పొరేటర్‌ను తిట్టినట్లు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పట్ల విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలవడానికి మరి ఇంత దిగజారిపోయినందుకు బాధగా ఉందన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో కార్పొరేటర్ దండా జ్యోతి రెడ్డి, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, వంటికొమ్ము శ్రీనివాస్‌రెడ్డి, జోగుపర్తి ప్రభాకర్, కంచర్ల దయాకర్, ఎడేల్లి బిక్షం, ఫ్రాన్సిస్, వలి, బుజ్జి, తీగల సతీష్, ఫయాజ్, తంగెళ్లపల్లి శ్రీను పాల్గొన్నారు.