నవతెలంగాణ- ఖమ్మం
నగరంలోని కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్‌కు చెందిన ఏ.గౌతమ్ ఇటీవల వరంగల్‌లో జరిగిన సౌత్ జోన్ జాతీయస్థాయి అథ్లెటిక్స్ మీట్‌లో 100 మీటర్ల పరుగులో రజత పతకం దక్కించుకోగా 200 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కళాశాల కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ కోట అప్పిరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కెవి రమణ, పిడి జే.ఉపేందర్, అధ్యాపకురాలు కల్పనలు అభినందనలు తెలిపారు.